News December 20, 2025
పర్యాటక రంగ అభివృద్ధిపై కలెక్టర్ సమావేశం

భద్రాద్రి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి, ప్రచార కార్యక్రమాలపై చర్చించేందుకు జిల్లాలోని టూరిజం సంబంధిత సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు కలెక్టరేట్లో సమావేశం జరుగుతుందన్నారు. టూరిజం రంగానికి సంబంధించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఆసక్తి గల వారు హాజరు అవ్వాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు.
Similar News
News December 30, 2025
జనవరి 1నుంచి పోలీస్ యాక్ట్ అమలు: సంగారెడ్డి ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ మంగళవారం తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 30, 2025
వారికి SBI అకౌంట్ ఉంటే చాలు ₹కోటి పరిహారం

SBIతో మార్చిలో కుదిరిన MoU ప్రకారం ఆ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ (SGSP) ఉన్న AP ప్రభుత్వ ఉద్యోగులకు ₹కోటి ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఈ భారీ పరిహారం నామినీకి అందుతుంది. ఎక్సైజ్ శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు జులైలో ప్రమాదవశాత్తు మరణించగా ఆయన కుటుంబానికి ₹కోటి పరిహారం తాజాగా అందింది. పథకం ప్రారంభమైన తర్వాత పరిహారం అందడం ఇదే మొదటిసారి.
News December 30, 2025
చరిత్ర చెబుతోంది.. వెండి ధరలు తగ్గుతాయ్: విశ్లేషకులు

ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరలు భారీగా పడిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ వెండి ధరలు పెరిగిన ప్రతిసారీ 40-90% పతనమయ్యాయని గుర్తుచేస్తున్నారు. ఔన్స్ వెండి ధర 1980లో $50 నుంచి $5కి (90%), 2011లో $48 -$12కి (75%), 2020లో $30 -$18కి (40%) పడిపోయాయంటున్నారు. పారిశ్రామిక డిమాండ్, చైనా ఎగుమతి ఆంక్షలతో ధరలు పెరుగుతున్నా క్రమంగా తగ్గే ఛాన్స్ ఉందని ఇన్వెస్టర్లను అలర్ట్ చేస్తున్నారు.


