News January 12, 2025

 పర్యాటక హబ్‌గా రూపొందిస్తాం: మంత్రి దుర్గేశ్

image

నరసాపురం ప్రాంతాన్ని ఒక పర్యాటక హబ్‌గా రూపొందిస్తామని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. శనివారం నరసాపురం వైఎన్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. టూరిజంను ఒక పరిశ్రమగా గుర్తించి, అభివృద్ధి చేస్తామన్నారు. అంతర్వేది మంచి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.

Similar News

News April 23, 2025

ప.గో: అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: కలెక్టర్

image

భవ్య భీమవరం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మంగళవారం కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయం‌లో కలెక్టర్ భవ్య భీమవరం సుందరీకరణ, మౌలిక వసతులు అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల పురోగతి, ఇంకా చేపట్టవలసిన పనులపై మున్సిపల్ అధికారులు,దాతలతో సమావేశమై సమీక్షించారు. కాస్మో పోలిటన్ క్లబ్ వద్ద వంశీకృష్ణ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.

News April 22, 2025

ఇబ్బందులు ఉంటే రైతులు తెలపాలి: జేసీ

image

ఉండి మండలం యండగండి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతు సేవ కేంద్రం ద్వారా కొనుగోలు సక్రమంగా జరుగుతుందా, అధికారులు మీకు సహకరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలపాలన్నారు. రైతులతో కలిసి తేమ శాతం పరిశీలించారు.

News April 22, 2025

భీమవరం లాడ్జిలో పోలీసుల తనిఖీలు

image

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ రెసిడెన్షియల్ & లాడ్జిపై టూ టౌన్ సీఐ కాళీ చరణ్ తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో 9మంది అమ్మాయిలు, 9మంది అబ్బాయిలు ఉన్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లాడ్జి నిర్వాహకుడు అంతం శ్రీను పరారైనట్లు స్థానికులు తెలిపారు.

error: Content is protected !!