News December 10, 2025
పర్వతగిరిలో హరిత పోలింగ్ స్టేషన్..!

పర్వతగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 30/7 పోలింగ్ స్టేషన్‌ను హరిత పోలింగ్ స్టేషన్‌గా తీర్చిదిద్దారు. ఆకుల అల్లికలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి పోలింగ్ స్టేషన్‌ను పూర్తిగా ఆకుపచ్చగా తయారు చేశారు. తహశీల్దార్ వెంకటస్వామి, ఏపీఎం రాజీరు ఆధ్వర్యంలో మహిళలు పోలింగ్ స్టేషన్ వద్ద రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓట్లు వేసేలా పోలింగ్ స్టేషన్‌ను సిద్ధం చేశారు.
Similar News
News December 10, 2025
జిల్లా అభివృద్ధిలో రహదారుల నిర్మాణం కీలకం: కలెక్టర్

జాతీయ రహదారుల నిర్మాణం బాగుంటే బాపట్ల జిల్లా అభివృద్ధి పట్టాలపై పయనిస్తుందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై కలెక్టర్ బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. అన్నిప్రాంతాలకు రవాణా సౌకర్యం, రహదారులు మెరుగ్గా ఉంటే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీ, సంక్షేమ సాధికారత అధికారిణి రాజదిబోరా పాల్గొన్నారు.
News December 10, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు విద్యార్థులు.. PHOTO GALLERY

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో విద్యార్థులు సందడి చేశారు. నిన్నటితో సమ్మిట్ ముగియగా ఇవాళ ఫ్యూచర్ సిటీలోని వేదిక వద్దకు స్టూడెంట్స్‌కు అధికారులు ఉచిత ప్రవేశం కల్పించారు. వారంతా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించారు. రోబో చేస్తున్న పనులను చూసి పారిశుద్ధ్య కార్మికులు ఆశ్చర్యపోయారు. అందుకు సంబంధించిన ఫొటోలను పైన గ్యాలరీలో చూడవచ్చు.
News December 10, 2025
వాస్తు ప్రకారం 4 మూలల్లో ఏమేం ఉండాలి?

ఇంటి మూలలు ప్రకృతి శక్తులకు అనుగుణంగా ఉండాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. దీని ప్రకారం.. ఇంటికి ఈశాన్య మూలలో గుంట(లోతు/నీరు), ఆగ్నేయ మూలలో మంట(వంటగది), నైరుతి మూలలో మెట్టగా(ఎత్తుగా, బరువుగా), వాయువ్య మూలలో గాలి(చలనం) ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది మంచి సంబంధాలకు, చలనానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


