News March 20, 2024

పర్వతగిరి: ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం గుర్తింపు

image

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మృతదేహం నీటిలో కొట్టుకెళ్తుండగా స్థానిక గొర్రెల కాపర్లు చూసి పోలీసులు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 8, 2025

వరంగల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

image

మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర నుంచి యధావిధిగా కార్మికులకే ఇవ్వాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవికి CITU రాష్ట్ర కార్యదర్శి మాధవి ఈరోజు వినతి పత్రం అందజేశారు. మాధవి మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, కార్మికులకు పని భద్రతను కల్పించాలని కోరారు.

News September 8, 2025

వరంగల్: ‘గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులకు నష్టపరిహారం అందజేయాలి’

image

గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులకు నష్టపరిహారం అందజేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కోరారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌లో బాధిత రైతులతో కలెక్టర్ సత్య శారదను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితుల రైతులందరూ కూడా చిన్న కారు రైతులని, ఈ భూమి పైనే వారి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారాన్ని అందించాలని కోరారు.

News September 7, 2025

వరంగల్ జిల్లాలో వర్షపాతం ఇలా..!

image

వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. ఖిలా వరంగల్ ప్రాంతంలో 56 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. గీసుకొండలో 38, దుగ్గొండి, సంగెం, నల్లబెల్లిలో 20 మి.మీ వర్షపాతం రికార్డయింది. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో వర్షం కురువలేదని, చెన్నారావుపేట, నర్సంపేట, పర్వతగిరిలో ఓ మోస్తరుగా వాన పడింది.