News September 5, 2025
పర్వతగిరి: గురువుకు 111 సార్లు సన్మానం..!

బోధన తన వృత్తి కాకపోయినా పాఠశాల, కళాశాల విద్యార్థులకు మ్యాథ్స్ బోధిస్తారు. ఆయన విద్యా బోధనలు విన్న పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. గురు దక్షిణగా ఆయనకు సన్మానాలు చేశారు. ఆయన శిష్యులు అందరూ కలిపి 111 సార్లు సన్మానాలు చేసినట్టు పర్వతగిరికి చెందిన మూస మహమ్మద్ తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా పలువురు విద్యార్థులు ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు.
Similar News
News September 7, 2025
ఆసిఫాబాద్: ఆకాశంలో విఘ్నేశ్వరుడి రూపం..!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని హనుమాన్ బస్తీలో అద్భుతం జరిగింది. వినాయక నిమజ్జనాలు ఉండగా ఆకాశంలో విఘ్నేశ్వరుడి రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులు ఆకాశంలోని వినాయక రూపాన్ని చూసి గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. స్వామివారి నిజ దర్శనం జరిగిందన్నారు. అక్కడే ఉన్న పలువురు యువకులు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు.
News September 7, 2025
ఖమ్మం: రేపు రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

స్థానిక సంస్థల ఓటర్ల జాబితాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రేపు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ల జాబితాపై సమీక్షించనున్నారు. జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులు రేపు సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో హాజరుకావాలని కలెక్టర్ కోరారు.
News September 7, 2025
జూ పార్కులో వివిధ రకాల జంతు, పక్షి పిల్లల జననం

విశాఖ జూ పార్కులో ఏడు జంతు, పక్షి పిల్లలు జన్మించాయి. చౌసింఘా, బ్లూ గోల్డ్ మకావ్, బ్లాక్ బక్ వంటి జాతులకు సంబందించిన పిల్లలు జన్మించినట్లు క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. బ్లూ గోల్డ్ మకావ్‌ను కొన్ని వారాలుగా నియంత్రిత ఇంక్యుబేషన్ సెంటర్లో ఉంచామన్నారు. వీటిని జూ వైద్య బృందం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారని, నూతన జంతు, పక్షి జాతులను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.