News December 12, 2025
పలమనేరు: బస్సు ప్రమాదంలో దంపతులు మృతి

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో పలమనేరుకు చెందిన ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మునినారాయణ శెట్టి వీధికి చెందిన భార్యాభర్తలు సునంద, శివశంకర్ రెడ్డి ఈ ప్రమాదంలో చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 12, 2025
నాగారం: సర్పంచిగా నిలబడటం, గెలుపొందడం రికార్డే

నాగారం సర్పంచ్‌గా రామచంద్రారెడ్డి గెలిచి రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టించారనే చెప్పవచ్చు. 95 ఏళ్ల వయసులో పోటీలో నిలబడటమే కాదు, గెలవడం కూడా ఈ రోజుల్లో రికార్డే. నేటి యువతతో కలిసి మెజారిటీతో గెలవడం వందేండ్లకు చేరువైన ఈ నవయువకుడికి ఓ మధురానుభూతి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి అయిన ఈ బాపు.. శేష జీవితాన్ని గ్రామాభివృద్ధి కోసం అంకితం ఇస్తానన్నారు.
News December 12, 2025
నడిమితండా: భర్త మాజీ ఉప సర్పంచి.. భార్య సర్పంచి

రాజంపేట మండలం నడిమి తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం నమోదైంది. ఇక్కడ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన బానోత్ లక్ష్మీ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ విజయం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. లక్ష్మీ భర్త షేర్ సింగ్ ఈ స్థానం నుంచి గతంలో ఉప సర్పంచిగా పని చేశారు. అయితే, ఈసారి సర్పంచి స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన తన భార్య లక్ష్మీని బరిలో దించి సర్పంచిగా గెలిపించారు.
News December 12, 2025
OTTలోకి రెండు కొత్త సినిమాలు

అల్లరి నరేశ్ హీరోగా నటించిన ’12A రైల్వే కాలనీ’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. అటు దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ నటించిన ‘కాంత’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా NOV 14న విడుదలవగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది.


