News September 11, 2025
పలమనేరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

పలమనేరు నుంచి చిత్తూరు వెళ్లే ఘాట్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సామర్లగడ్డ గ్రామానికి చెందిన పవన్ (ప్రైవేటు ఫైనాన్స్ ఉద్యోగి) అక్కడికక్కడే మృతి చెందారు. వృత్తి నిమిత్తం బైక్ పై ప్రయాణిస్తుండగా, మొగిలి ఘాట్ వద్ద ట్రైన్ చక్రాలు తరలిస్తున్న లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. పవన్ మరణంతో అతడి కుటుంబం కన్నీటి పర్యంతమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 11, 2025
చిత్తూరు: పశువ్యాధి నివారణ గోడ పోస్టులు ఆవిష్కరించిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ చాంబర్‌లో జాతీయ పశువ్యాధి నియంత్రణ గోడపోస్టర్లను కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పశువులకు సమయానుకూలంగా టీకాలు వేయడం ద్వారా వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుందని రైతులు, పశుపోషకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News September 10, 2025
డ్రాపౌట్స్ రహిత బడులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

డ్రాపౌట్స్ రహిత బడులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం సమగ్ర శిక్ష APC మద్దిపట్ల వెంకటరమణతో కలిసి MEO, CRC హెచ్ఎంలతో రివ్యూ నిర్వహించారు. పాఠశాల వారీగా డ్రాప్స్ జాబితా ఇవ్వాలని సూచించారు. పిల్లలు 100% పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. మిడ్ డే మీల్స్, హ్యాండ్ బుక్, FA-1 మార్కులు, CRC గ్రాండ్స్, MRC గ్రాండ్స్ పై రివ్యూ చేపట్టారు.
News September 10, 2025
చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు: JD

జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ అన్నారు. ఇప్పటివరకు 12,500 టన్నుల యూరియాను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంకా వెయ్యి టన్నుల యూరియా అందుబాటులో ఉందని, 2,500 టన్నుల యూరియా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. భూసారాన్ని బట్టి యూరియాను వాడాలని, అధికంగా వాడితే భూమి సారాన్ని కోల్పోతుందని, పంటలో నాణ్యత దిగుబడి తగ్గుతుందని సూచించారు.