News August 8, 2024
పలమనేరు: 19మంది మెప్మా సిబ్బందిపై వేటు

‘డాయ్’ యాప్ మోసాలపై మెప్మా సిబ్బందిపై వేటు పడింది. డాయ్ యాప్ మోసాలపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. దీని మేరకు సిటీ మిషన్ మేనేజర్ ఉమేష్ జాదవ్, ముగ్గురు కమ్యూనిటీ ఆర్గనైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజేశ్, 14 మంది ఆర్పీలను తొలగించేలా మెప్మా పీడీ ఆదేశాలను జారీ చేశారు. అలాగే వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశించారు.
Similar News
News December 21, 2025
చిత్తూరు: రేపు ఉదయం 9 నుంచి ప్రారంభం.!

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యక్రమం జరగనుందని, జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీ నమోదు, స్థితిపై 1100కి కాల్ చేయవచ్చన్నారు.
News December 21, 2025
జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పెద్దిరెడ్డి

YCP అధినేత జగన్ను ఆదివారం ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్‌కు బొకే అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం పెద్దిరెడ్డి గురించి వివరించారు.
News December 21, 2025
TDP చిత్తూరు జిల్లా బాస్ ఎవరంటే..?

TDP చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వై.సునీల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. పుత్తూరుకు చెందిన షణ్ముగ రెడ్డిది వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం. గతంలో జిల్లా అధ్యక్షుడిగా CRరాజన్ పనిచేశారు. ప్రస్తుతం అదే సామాజికవర్గానికి చెందిన షణ్ముగ రెడ్డికి అవకాశమిచ్చారు. తిరుపతి జిల్లా అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్ రెడ్డి నియమితులయ్యారు.


