News April 20, 2024
పలాస: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

పలాస రైల్వే స్టేషన్‌లో స్థానిక జీఆర్పీ పోలీసులు శుక్రవారం బిహార్‌కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. భువనేశ్వర్ నుంచి విశాఖ వెళుతున్న ఇంటర్‌సీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఐదుగురు యువకులను జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద ఉన్న బ్యాగులు క్షుణ్ణంగా పరిశీలించగా 27 గ్రాముల బంగారం, ఐదు తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన సిక్కోలు ఆణిముత్యాలు

నేడు విడుదలైన SSC ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. 550 దాటిన మార్కుల్లో అమ్మాయిలదే పైచేయి. లావేరుకు చెందిన హరిత 600కి 592 మార్కులు వచ్చాయి. పలు మండలాల్లో ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్ ఎన్ పేట- 569( జాహ్నవి) , టెక్కలి- 577( లావణ్య), లావేరు-578( కుసుమ శ్రీ), రణస్థలం – 590(ఝాన్సీ) పది ఫలితాల్లో అదరగొట్టారు.
News April 23, 2025
SKLM: గ్రామదేవతల సిరిమాను ఉత్సవంపై సమీక్ష

అన్ని శాఖల సమన్వయంతో శ్రీ గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. బుధవారం కలెక్టరెట్ మందిరంలో గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమన్వయంతో విధులు నిర్వహించి పండగ ఒక మంచి వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
News April 23, 2025
శ్రీకాకుళంలో పదో తరగతి విద్యార్థి సూసైడ్

పదో తరగతి ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని శ్రీకాకుళానికి చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలగ ప్రాంతానికి చెందిన గురుగుబిల్లి వేణుగోపాలరావుకు బుధవారం విడుదలైన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 393 మార్కులు వచ్చాయి. తక్కువ రావడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.