News April 12, 2024

పలాస: అనారోగ్యంతో విశ్రాంత ఉపాధ్యాయుడి మృతి

image

పలాస మండలం కిష్టుపురం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బుర్లె జగ్గారావు శుక్రవారం ఉదయం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దివంగత నేత అప్పయ్య నుంచి నేటి తరం రాజకీయ నాయకులతో పాటు పరోక్ష రాజకీయాల్లో పాలు పంచుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన మరణ వార్త విన్న సమీప గ్రామ ప్రజలు, ఆయన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు వేలాదిమంది తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Similar News

News April 22, 2025

శ్రీకాకుళం: అమ్మా నేనొస్తున్నా అంటూనే..!

image

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి RH కాలనీలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నెయ్యల గోపాల్ తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ‘అమ్మా.. నేను ఇంటికి వస్తున్నా’ అంటూ తల్లికి కాల్ చేశాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కాలేజీలో సంప్రదించారు. విజయనగరం రైల్వే స్టేషన్ పరిసరాల్లో గోపాల్ అనుమానాస్పదంగా చనిపోయాడని కాలేజీ ప్రతినిధులు తల్లికి చెప్పడంతో బోరున విలపించారు.

News April 22, 2025

సివిల్ సర్వీసులో మెరిసిన చిక్కోల్ యువకుడు

image

కోటబొమ్మాలి మండలం చలమయ్యపేటకు చెందిన లింగుడు జోష్ సివిల్ సర్వీస్‌ పరీక్షల్లో సత్తా చాటారు. మంగళవారం విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 790 ర్యాంక్ సాధించాడు. ఇతని తండ్రి బాలయ్య మాజీ సైనిక ఉద్యోగి, తల్లి రాజ్యలక్ష్మి. దీంతో జోష్‌ను పలువురు అభినందించారు.

News April 22, 2025

జలుమూరు: నాడు IPS.. నేడు IAS

image

జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేశ్ 2023 సర్వీసెస్ ఫలితాలలో 467 ర్యాంక్ సాధించి IPSకు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. అయితే IAS కావాలనే సంకల్పంతో వెంకటేశ్ మళ్లీ సివిల్స్ పరీక్షలు రాశాడు. మంగళవారం విడుదలైన సర్వీసెస్ ఫలితాలలో 15వ ర్యాంక్‌తో ఐఏఎస్ సాధించాడు. దీంతో వెంకటేశ్ తల్లిదండ్రులు చందర్రావు, రోహిణి అనందం వ్యక్తం చేశారు. వెంకటేశ్‌ని పలువురు అభినందించారు.

error: Content is protected !!