News January 12, 2025

పలాస నేషనల్ హైవేపై వ్యాన్ బోల్తా

image

మండలంలోని నెమలి నారాయణపురం జాతీయ రహదారిపై మినీ వ్యాన్ శనివారం రాత్రి అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. ఆ సమయంలో భారీ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించారు.

Similar News

News September 15, 2025

నేడు జడ్పీ కార్యాయలంలో PGRS కార్యక్రమం: కలెక్టర్

image

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు పేర్కొన్నారు.

News September 14, 2025

ఎచ్చెర్ల: రేపు అంబేడ్కర్ యూనివర్సిటీలో NSS వాలంటీర్లు ఎంపిక

image

ఎచ్చెర్లలో గల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో NSS వాలంటీర్ల ఎంపిక సోమవారం జరుగుతుందని ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ డి. వనజ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది దేశ దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ పేరేడ్‌లో పాల్గొనేందుకు ఎంపికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేట్ యూత్ ఆఫీసర్ సైదా రమావత్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు.

News September 14, 2025

రామ్మోహన్‌ను కలిసిన అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్టార్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఎచ్చెర్ల నూతన రిజిస్టార్‌గా నియమితులైన ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాన్ని అందించారు. తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు వైస్ ఛాన్స్‌లర్‌కు ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.