News March 27, 2025

పలాస: పెళ్లయినా 50 రోజులకు యువకుడి మృతి

image

పలాసలోని మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా యువకుడు పెళ్లయిన 50 రోజులకు మృతి చెందినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. మండలంలోని గొల్లమాకన్నపల్లికి చెందిన మధు(28) సింగుపురానికి చెందిన ఓ యువతని ప్రేమించి ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకున్నాడు. మంగళవారం రాత్రి కోసంగిపురం ప్లై ఓవర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 30, 2025

శ్రీకాకుళం: వివాహిత హత్యకు కారణాలేంటి..?

image

శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహిత శుక్రవారం దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు వివరాల ప్రకారం.. కవిటి (మ) ఆర్.కరపాడుకు చెందిన మీనా, భర్త దిలీప్‌తో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా దుండగలు బీరు సిసాలతో తమపై దాడి చేశారని దిలీప్ చెప్పాడు. గాయపడిన మీనాక్షిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. ఎస్సై రవివర్మ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.

News March 30, 2025

ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదనరావు శనివారం తెలిపారు. మృతుడు శ్రీకాకుళం పట్టణం గునాపాలెంకు చెందిన రమణారావు(49)గా గుర్తించారు. శుక్రవారం నుంచి రమణారావు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ట్రాక్‌పై విగతజీవిగా పడి ఉన్న రమణను చూసి నిశ్చేష్ఠులయ్యారు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News March 30, 2025

టెక్కలి: దూరవిద్యలో డిగ్రీ పూర్తికి ముగుస్తున్న గడువు

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంగా ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యా విధానంలో B.A, B.Com డిగ్రీ విద్యనభ్యసించేందుకు దరఖాస్తుకు ఆఖరు తేది మార్చి 31తో ముగుస్తుందని శనివారం కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ డాక్టర్ టి. గోవిందమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల ఇంటర్మీడియట్, ఐటీఐ ఉత్తిర్ణీత అయి ఆసక్తి కలిగిన అభ్యర్థులు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.

error: Content is protected !!