News October 30, 2024
పలాస: మాజీ మంత్రి అప్పలరాజుకు అస్వస్థత
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారం ఉదయం పలాసలోని నివాసంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని మెడికవర్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అప్పలరాజు చికిత్స పొందుతున్నారు. మంగళవారం నివాసంలో కింద పడడంతో గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సీదిరి అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు ఆయనకు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు
Similar News
News October 30, 2024
ఎచ్చెర్ల. డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ను నేడు విడుదల చేశారు. ఈ పరీక్ష ఫీజులను ఎటువంటి అపరాధ రుసుం లేకుండా నవంబరు 11వ తేదీ వరకు చెల్లించవచ్చని యూనివర్సిటీ డీన్ తెలిపారు. అదేవిధంగా తెలిపారు. సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు నవంబర్ 18 నుంచి 23వ నుంచి వరకు, సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 28 నుంచి జరుగుతాయని నుంచి తెలిపారు.
News October 30, 2024
టెక్కలిలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
టెక్కలి సబ్ కలెక్టరేట్ సమీపంలో నివాసం ఉంటున్న సంపతిరావు దివ్య(28) అనే వివాహిత బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ఆమె కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతుంది. భర్త శ్రావణ్ కుమార్ టెక్కలి తహశీల్దార్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనపై ఎస్సై రాము కేసు నమోదు చేశారు.
News October 30, 2024
శ్రీకాకుళంలో అత్యధికంగా మహిళా ఓటర్లు
ముసాయిదా ఓటరు జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా శ్రీకాకుళం ఉంది. నియోజకవర్గం మొత్తం 2,73,364 మంది ఓటర్ల ఉండగా అందులో 1,38,020 మంది మహిళా ఓటర్ల ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను నియమించారు.