News August 8, 2024

పలాస: రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

శ్రీకాకుళం జిల్లా పలాస- తుమ్మాదేవి రైల్వే స్టేషన్‌ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ ఐఎస్ కే షరీఫ్ గురువారం తెలిపారు. మృతుడి వయసు సుమారుగా 35 -40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 94406 27567 నంబర్‌ను సంప్రదించాలని ఎస్సై సూచించారు.

Similar News

News February 21, 2026

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలు ఎంతమంది రాయనున్నారంటే?

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కాగా మార్చి 20 తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కలిపి 39,838 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం మొత్తం 70కి పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు మధ్య పరీక్షలు జరగనున్నాయి.

News February 21, 2026

శ్రీకాకుళం: మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం విడుదల

image

మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీం ద్వారా ఎక్స్ గ్రేషియా విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 95 మంది మత్స్యకారులు మృతిచెందగా వారిలో 90 మందికి రూ.4 కోట్ల 75 లక్షలు నిధులు విడుదల చేసి వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు జమ చేశామన్నారు. మిగిలిన ఐదుగురుకు సాంకేతిక కారణాల ద్వారా ఆగిందన్నారు.

News February 21, 2026

నరసన్నపేట: 48 గంటల్లోనే జాబ్ కార్డు మంజూరు

image

ఉపాధి హామీ పథకం లో భాగంగా లబ్ధిదారులు జాబ్ కార్డ్ కోరిన 48 గంటలలోనే మంజూరు చేయడం జరుగుతుందని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ లవ రాజు తెలిపారు. నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద జరిగిన ప్రజా వేదికలో భాగంగా శుక్రవారం సాయంత్రం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వేతనదారుడికి పని కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు.