News February 7, 2025
పలు ఉన్నత ఆశ్రమ పాఠశాలను సందర్శించిన MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఉన్నత ఆశ్రమ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్‌ను జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే పరిశుభ్రంగా ఉండే బోజనం అందించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాల ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
Similar News
News October 29, 2025
సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడిలా ఎలా మారాడు?

పూర్వకాలంలో సంవత్సర ప్రారంభాన్ని కృత్తికా(కార్తీక) నక్షత్రంతో లెక్కించేవారు. ఆ నక్షత్రంతో సుబ్రహ్మణ్య స్వామికి ఓ గొప్ప అనుబంధం ఉంది. ఈ నక్షత్రం ఆరు తారల సమూహం. సుబ్రహ్మణ్య స్వామిని కూడా షణ్ముఖుడు అని అంటారు. అంటే ఆరు తలలు గలవాడు అని అర్థం. ఆకాశంలో ఉన్న ఈ ఆరు కృత్తికా నక్షత్రాలే తల్లి రూపంలో వచ్చి ఆయనకు పాలు ఇచ్చాయట. అందువల్లే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
News October 29, 2025
MBNR: కురుమూర్తి.. ఈ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు

మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి జాతర సందర్భంగా ఆయా డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు మహబూబ్ నగర్ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ Way2Newsతో తెలిపారు. నేటి నుంచి మహబూబ్‌నగర్-20, నాగర్‌కర్నూల్-15, వనపర్తి-15, కొల్లాపూర్-6, నారాయణపేట-4 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 29, 2025
నేడు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

AP: తుఫాన్ వల్ల పత్తి రైతులు నష్టపోకూడదని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం కానున్నాయి. క్వింటాలుకు ₹8,110 మద్దతు ధర ఖరారు చేశారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను CM యాప్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలి. తర్వాత ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి.


