News October 22, 2025
పలు రైళ్లు రాకపోకల ఆలస్యం: SCR

ఢిల్లీ నుంచి తెలంగాణ మీదుగా ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నేడు నడవనున్నట్లు SCR పేర్కొంది. T. No.22692 నిజాముద్దీన్ – KSR బెంగళూరు రాజధాని రైలు 6 గంటలు, T.No. 20806 న్యూ ఢిల్లీ – విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ SF 8.30 గంటలు, T.No.12626 న్యూ ఢిల్లీ – త్రివేండ్రం కేరళ SF 10.25 గంటలు, T.No.12622 న్యూ ఢిల్లీ – చెన్నై తమిళనాడు SF 10.40 గంటలు నిన్న బయలుదేరిన రైలు బుధవారం ఆలస్యంగా నడుస్తుందన్నారు.
Similar News
News October 24, 2025
బస్సు ప్రమాదంలో.. పటాన్‌చెరు వాసులు మృతి

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్‌చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కృష్ణా జిల్లా DMHOగా బాధ్యతలు స్వీకరించిన డా. యుగంధర్

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(DMHO)గా డా. యుగంధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. DMHOగా బాధ్యతలు నిర్వర్తించిన డా. శర్మిష్ట గత నెల పదవీ విరమణ చేయగా ఆమె స్థానంలో యుగంధర్ నియమితులయ్యారు. ఎముకల శస్త్ర చికిత్స నిపుణుడైన యుగంధర్ గతంలో గుడివాడ, అవనిగడ్డలో పని చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా కూడా పని చేశారు. నూతన DMHOను పలువురు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.