News February 7, 2025

పలు సమస్యలపై పార్లమెంట్‌‌లో మాట్లాడిన ఎంపీ బాలశౌరి 

image

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గురువారం పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో కొన్ని సమస్యలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు వివరించారు. జిల్లాలో గుడివాడలో కేటీఆర్ కళాశాల, గిలకలదిండి, మెడికల్ కళాశాల, బందర్‌‌లోని చిలకలపూడి, పెడన్ మెయిన్ రోడ్, ఉప్పులూరు, గూడవల్లి, నిడమానూరు, గుడ్లవల్లేరు, రామవరప్పాడు వద్ద ROB, RUBలను నిర్మించి ట్రాఫిక్‌కు చెక్ పెట్టాలని కేంద్రమంత్రిని కోరారు.   

Similar News

News July 10, 2025

కృష్ణా: గుర్తింపు లేని పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు

image

ఆరు సంవత్సరాలుగా ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలజీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధంగా నమోదై, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని ఈ పార్టీలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు.

News July 10, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞కృష్ణా: రేపే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
☞ గుడివాడ ఫ్లైఓవర్ పనులు వేగవంతం
☞ వీరవల్లి: మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
☞ మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
☞ కృష్ణా: పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు
☞ మచిలీపట్నం: మైనర్ల తల్లిదండ్రులకు డీఎస్పీ రాజా హెచ్చరికలు
☞ కనకదుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న శాఖాంబరి ఉత్సవాలు

News July 9, 2025

వీరవల్లి: మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

image

మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.