News November 13, 2025

పల్నాటి కోడి పందెం.. యుద్ధానికి దారి తీసింది!

image

పల్నాటి యుద్ధానికి దారి తీసిన కీలక ఘటన కోడి పందెంలో చోటు చేసుకుంది. బ్రహ్మనాయుడి కోడిపుంజు చిట్టిమల్లు, నాగమ్మ కోడిపుంజు నల్లమల్లుతో పోటీపడింది. మొదటి పందెం నల్లమల్లు గెలవగా, రెండో పందెంలో నాగమ్మ శివంగి డేగను దింపింది. ఈ పందెంలో చిట్టిమల్లు మృతి చెందడంతో, మాచర్ల రాజులు దీనిని అవమానంగా భావించారు. ఈ ఘటనే క్రమంగా ఉద్ధృతమై చివరకు పల్నాటి యుద్ధానికి నాంది పలికింది.

Similar News

News November 13, 2025

మార్నింగ్ అప్డేట్స్

image

* ఢిల్లీ పేలుడు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి.. 13కు చేరిన మరణాల సంఖ్య
* APలోని గుంటూరులో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం.. విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం PSలో కేసు నమోదు
* TGలోని ములుగులో చలికి వృద్ధురాలు రాధమ్మ(65) మృతి
* తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
* అఫ్గానిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం

News November 13, 2025

మంచిర్యాలలో విషాదం.. 7 నెలల గర్భిణి మృతి

image

మంచిర్యాలలో విషాదం జరిగింది. కాసిపేట మండలం కోమటిచేనుకు చెందిన లక్ష్మణ్ BSF జవాన్‌గా ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య అనురాధ(35), కొడుకు ఉన్నాడు. కాగా భార్య ప్రస్తుతం 7నెలల గర్భిణి. ఆమెకు 2 సార్లు ఫిట్స్, కడుపునొప్పి రావడంతో మంచిర్యాలలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రసవం చేసేందుకు ఆపరేషన్ చేయగా తల్లి, పుట్టిన మగ శిశువు మృతిచెందారు. విషయం తెలిసి ఢిల్లీ నుంచి లక్ష్మణ్ కాసిపేటకు వస్తున్నారు.

News November 13, 2025

కరీంనగర్: విద్యాశాఖలో ఆ ‘FILE మాయం’..!

image

పదో తరగతి పరీక్షల మూల్యాంకన జవాబు పత్రాలు అమ్మగా వచ్చిన నిధులకు సంబంధించిన ఫైల్ కరీంనగర్ విద్యాశాఖలో మాయమైనట్లు తెలుస్తోంది. 2022- 23 MAR, JUN మూల్యాంకన పత్రాలను అధికారులు అమ్మారు. కాగా, దీని ద్వారా వచ్చిన రూ.1.30 లక్షలు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. దీనిపై అటు సూపరింటెడెంట్ ఇటు ఆఫీసు సిబ్బంది ఒకరిపైఒకరు అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ గోల్‌మాల్ ముఖ్యమైన విద్యాశాఖను అభాసుపాలు చేస్తోంది.