News December 2, 2024
పల్నాటి వీరుల చరిత్రను ఎప్పుడు ముద్రించారో తెలుసా?
పల్నాటి వీరుల చరిత్రను తొలిసారి శ్రీనాథుడు 300 సంవత్సరాల తర్వాత మంజరీ ద్విపద కావ్యముగా రచించగా, ఇది ఆయన చివరి రచన. శ్రీనాథుని తర్వాత కొండయ్య, మల్లయ్య (16వ శతాబ్దం) అను కవులు రచించారు. ఆ తర్వాత 1862 ప్రాంతంలో ముదిగొండ వీరభద్రకవి ఈ కథను వీర భాగవతం పేరుతో మనోహరమైన పద్యకావ్యంగా రచించారు. అక్కిరాజు ఉమాకాంతం మొట్టమొదట పల్నాటి వీరచరిత్ర యొక్క ప్రతులు సంపాదించి, సంస్కరించి 1911లో అచ్చువేయించారని సమాచారం.
Similar News
News December 26, 2024
అంబటి రాంబాబు మరో సంచలన ట్వీట్
‘పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే’ అంటూ అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పుష్ప-2 సినిమాలో ఓ సన్నివేశానికి సంబంధించిన డైలాగ్‌తో ట్వీట్ చేశారు. కాగా అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ పెద్దలు రేవంత్ రెడ్డిని నేడు కలిసిన సందర్భంలో ఈ ట్వీట్ చేయడంతో నెటిజన్లు దీనిని వైరల్ చేస్తున్నారు.
News December 26, 2024
గుంటూరు: రైల్లో నుంచి పడి మహిళ మృతి
రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ రైలు నుంచి జారిపడటంతో గుంటూరుకు చెందిన హేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రైలు నుంచి జారి పడడంతో గోదావరి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాధాకృష్ణ స్థానికులు సాయంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్చగా బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ లోవరాజు తెలిపారు.
News December 26, 2024
కొల్లూరు: పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన కారు డ్రైవర్
పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన ఓ మహిళ 2022లో బంధువుల పెళ్లికి వెళ్లింది. పృథ్వీరాజ్ అనే వ్యక్తి RSI అని పరిచయమయ్యాడు. ఈ ఏడాది ఆగస్టు 18న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత అతనిలో మార్పు చూసి ఆరా తీయగా అసలు పేరు వెంకటేశ్వరావు, కారు డ్రైవర్ అని ముందే పెళ్లైయి పిల్లలున్నారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.