News December 19, 2025

పల్నాడలో సీఎం పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే

image

సీఎం చంద్రబాబు పనితీరుపై గురువారం నుంచి ఐవీఆర్‌ఎస్ (IVRS) సర్వే నిర్వహిస్తోంది. గత 18 నెలల కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పనితీరుపై అభిప్రాయం ఎలా ఉంది చెప్పడానికి పల్నాడు జిల్లాలో ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది. ‘బాగుంది (1)’, ‘పర్వాలేదు (2)’, ‘బాగోలేదు (3)’ నంబర్‌లను నొక్కి తమ అభిప్రాయాన్ని తెలపాలని కోరారు. మరి మీకు కాల్ వచ్చిందా కామెంట్ చేయండి.

Similar News

News December 19, 2025

గుంటూరులో గంజాయి అక్రమ రవాణా.. ఐదుగురి అరెస్ట్

image

గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేసి, 1.20కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్రాడిపేట ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి, నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన CI ఆరోగ్యరాజు, SI క్రిష్ణ బాజీ బాబు, సిబ్బందిని వెస్ట్ DSP అరవింద్ అభినందించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు.

News December 19, 2025

భద్రాచలం-మేడారం రోడ్ల అభివృద్ధికి నిధులు: కిషన్‌రెడ్డి

image

ములుగు జిల్లా బీజేపీ నేతలు ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనవరిలో జరిగే మహాజాతరలో రావాలని ఆహ్వానించారు. అనంతరం మేడారం జాతరకు కేంద్రం నుండి నిధులు మంజూరు చేయాలని కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. భద్రాచలం నుంచి మేడారం, కాలేశ్వరం వరకు రోడ్లను అభివృద్ధి చేసి సమ్మక్క, సారక్క యూనివర్సిటీకి నిధులు మంజూరు చేస్తామని కేంద్రమంత్రి అన్నారు.

News December 19, 2025

‘పీ4’తోనే పేదరిక నిర్మూలన: కలెక్టర్

image

పేదరిక నిర్మూలనకు P4 విధానం ఒక గొప్ప వేదికని కలెక్టర్ అన్సారియా అన్నారు. శుక్రవారం ఆటోనగర్‌లోని ‘పీఐ డేటా సెంటర్’లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంస్థ సీఈవో కళ్యాణ్ ముప్పనేని ఆధ్వర్యంలో ఎంపికైన లబ్ధిదారులకు కుట్టు యంత్రాలు, వ్యవసాయ స్ప్రే ట్యాంకర్లు, ఎలక్ట్రికల్ కిట్‌లను పంపిణీ చేశారు. పేదల ఆర్థికాభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి చేయూతనందించడం అభినందనీయమని ఆమె కొనియాడారు.