News October 13, 2025
పల్నాడులో ఆ మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం

పల్నాడు జిల్లాలో నరసరావుపేటకు అత్యధిక ఆదాయం పన్నుల రూపంలో ఈ ఏడాది రూ.89 లక్షలు సమకూరింది. మున్సిపాలిటీలు స్వయం ప్రతిపత్తిని సాధించాలనే రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆస్తి పన్నులపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో మాచర్లకు రూ. 36 లక్షలు, సత్తెనపల్లికి రూ. 29లక్షలు, పిడుగురాళ్లకు రూ. 26 లక్షలు, గురజాలకు రూ. 12 లక్షలు ఆదాయం లభించింది. పన్నుల విధానంపై ఇంటింటి సర్వేతో సాధ్యమైందని అధికారులంటున్నారు.
Similar News
News October 13, 2025
రేషన్ బియ్యాన్ని గుర్తించేలా ర్యాపిడ్ కిట్స్: నాదెండ్ల

AP: పీడీఎస్(రేషన్) బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఇవి రేషన్ బియ్యం అక్రమ రవాణాను గుర్తించేందుకు ఉపయోగపడుతాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న బియ్యాన్ని పరిశీలిస్తున్నామని, నిఘా విభాగం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,65,000 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
News October 13, 2025
వంటింటి చిట్కాలు

* బొంబాయిహల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* పచ్చి బటానీ ఉడికించేటప్పుడు కాస్త పంచదార వేస్తే వాటి రుచి పెరుగుతుంది.
* బనానా చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్‌వాజుల్లో నీరు మార్చినపుడు అందులో కాస్త పంచదార వేస్తే పూలు వాడిపోకుండా ఉంటాయి.
* బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమలు తీసేసి ప్లాస్టిక్ కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.
News October 13, 2025
ధర్మవరానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

ధర్మవరం ప్రాంతాన్ని రాయల కాలంలో విజయ నగర రాజులచే నియమింపబడిన క్రియాశక్తి వడయార్ అనే రాజు పాలించేవాడు. ఆయన భార్య ధర్మాంబ పేరు మీద నిర్మించిన గ్రామమే ధర్మవరం. నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు పట్టణంగా అభివృద్ధి చెందింది. ఈ పట్టణం పట్టు వస్త్రాల నేతతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.