News January 4, 2026
పల్నాడులో కేజీ చికెన్ ధర ఎంతంటే.!

వరుస పండుగల నేపథ్యంలో చికెన్ ధరలు పెరుగుతున్నాయి. నరసరావుపేటలో ఆదివారం లైవ్ కోడి కేజీ రూ. 153 ఉంది. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్, పెద్ద చెరువు, సత్తెనపల్లి రోడ్డు, తదితర ప్రాంతాల్లో చికెన్ స్కిన్ లెస్ కేజీ 260 నుంచి రూ. 280 విక్రయిస్తునారు. స్కిన్‌తో కేజీ రూ. 240 నుంచి రూ. 260 ఉంది. మటన్ కేజీ ధర రూ. 900 నుంచి రూ. వెయ్యి అందుబాటులో ఉంది. 100 కోడిగుడ్లు రూ. 640 నాన్ వెజ్ ప్రియులకు అందుబాటులో ఉన్నాయి.
Similar News
News January 11, 2026
మెట్‌పల్లి: అనుదీప్‌కు బిట్స్ పిలానీ ‘యంగ్ అచీవర్స్’ అవార్డు

ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల నుండి జ్యూరీ కమిటీ అవార్డులకు ఎంపిక చేసింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని పబ్లిక్ లైఫ్ కేటగిరీలో ప్రతిభావంతమైన సేవలు చేస్తున్నందుకు గాను ‘యంగ్ అచీవర్స్ అవార్డు’కు ఎంపిక చేశారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయనకు అవార్డును అందజేశారు.
News January 11, 2026
తిరుమలలో జాగ్రత్త..!

వరుస సెలవులతో తిరుమలలో రద్దీ ఏర్పడింది. కొండపై చలి సైతం పెరిగింది. చిన్నారులు, వృద్ధులతో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. చలిని తట్టుకునేలా తగిన వస్తువులు తీసుకు రావడం ఉత్తమం. అలాగే తిరుమలలో తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల నాగరత్నమ్మ అనే మహిళ ఓ భక్తురాలికి మత్తుమందు కలిపిన పాలు ఇచ్చి క్యూలైన్‌లో బంగారు తాళిబొట్టు <<18821755>>దోచేసింది. <<>>సో కొండపై తెలియని వ్యక్తులు ఇచ్చే పదార్థాలు తీసుకోవద్దు.
News January 11, 2026
ఖమ్మం: ‘అన్న’ అనుకుంటే అంతం చేశాడు!

ఖమ్మంలో ప్రమీల అనే <<18814797>>మహిళ <<>>దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సోదరుడి వరుసయ్యే శ్రవణ్, ఆమెను ఆర్థికంగా వాడుకోవడమే కాకుండా భర్తకు దూరం చేశాడు. పద్ధతి మార్చుకోవాలని ఆమె హెచ్చరించడమే అతడి కక్షకు కారణమైంది. శుక్రవారం అర్ధరాత్రి బావమరిది రమేశ్‌తో కలిసి మార్గమధ్యంలో ఆమెను అడ్డగించి కిరాతకంగా గొంతుకోసి హతమార్చాడు. ఈ ఘాతుకం స్థానికంగా కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


