News November 9, 2025
పల్నాడులో చికెన్ ధరలు ఇవే..!

పల్నాడులో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ ధర రూ.200 నుంచి రూ.230, స్కిన్‌తో రూ.180 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు. లైవ్ కోడి కేజీ రూ.108గా ఉంది. 100 కోడి గుడ్లు రూ.600గా ఉంది. మటన్ కేజీ రూ.800 నుంచి 900కి విక్రయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News November 9, 2025
NZB: విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తా: కవిత

విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. శనివారం రాత్రి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు, ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇతర అంశాల గురించి చర్చించారు.
News November 9, 2025
జన్నారం: గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

జన్నారం మండలం బాదంపల్లి శివారులోని గోదావరిలో గల్లంతైన యువకుడు గుండా శ్రావణ్ మృతి చెందారు. శనివారం బాదంపల్లి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ఫోటో దిగుతూ ప్రమాదవశాత్తు ఆయన గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం బాదంపల్లి శివారులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు. శ్రావణ్ మృతితో ఆయన కుటుంబంతో పాటు పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.
News November 9, 2025
కాగజ్‌నగర్: పేదలకు అందని కంటి వైద్యం

కాగజ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో కంటి వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వం కంటి పరీక్షల కోసం సుమారు రూ.5 లక్షల విలువైన కంటి పరీక్ష యంత్రం (ఆప్టోమె ట్రిస్ట్) ఏర్పాటు చేసి వైద్యుడిని నియమించింది. 3 నెలల నుంచి యంత్రం మరమ్మతులో ఉంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కంటివైద్యం అందని ద్రాక్షగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.


