News October 11, 2025

పల్నాడులో నేర నియంత్రణకు ఎస్పీ ఆదేశాలు

image

నరసరావుపేట పోలీస్ కార్యాలయంలో సెప్టెంబర్ నెల నేర సమీక్షా సమావేశం ఎస్పీ బి.కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. పోలీస్ సేవలు సమర్థవంతంగా అందించేందుకు ప్రతి రోజు కాల్స్, వారానికోసారి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. మహిళా భద్రత, శక్తి కాల్స్, డ్రోన్ గస్తీ, రాత్రి గస్తీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Similar News

News October 12, 2025

రాహుల్ మాదిరే తేజస్వీ ఓడిపోతారు: PK

image

అమేఠిలో గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓడినట్లే RJD నేత తేజస్వీ యాదవ్ రాఘోపుర్‌లో పరాజయం చెందుతారని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. ఆ నియోజకవర్గంలో కుటుంబ ఆధిపత్యాన్ని ఓటర్లు ఒప్పుకోవట్లేదని విమర్శించారు. తేజస్వీ కుటుంబం ఇక్కడి నుంచి ఎన్నికవుతున్నా కనీస సౌకర్యాలు కరవయ్యాయని ఆరోపించారు. అటు ఎన్నికల్లో తన పోటీపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

News October 12, 2025

సచివాలయం: వీధి కుక్కలను పట్టుకున్న అధికారులు

image

తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. సచివాలయం ప్రాంగణంలోని మీడియా పాయింట్, క్యాంటీన్, విజిటర్స్ లాంగ్‌లో తిరుగుతున్న కుక్కలను అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, సందర్శకులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

News October 12, 2025

VKB: బాలికలు.. క్రీడల్లో మహారాణులు

image

వికారాబాద్ జిల్లా పుట్టపాడు హై స్కూల్‌కి చెందిన బాలికలు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన బాలికలు కబడ్డీ అండర్-14 బాలికల విభాగంలో పరిగి జోన్‌లో విజేతగా నిలిచారు. వసుధా రెడ్డి, మదిహా ఫాతిమా, అక్షిత జిల్లాస్థాయిలో రాణించి, ప్రతిభ చాటారు. PD ప్రణవి ప్రోత్సాహంతో విద్యార్థులు అన్ని క్రీడల్లో రాణిస్తున్నారు. నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా.. Way2News ప్రత్యేక కథనం.