News September 13, 2025

పల్నాడులో ప్రకంపనలు రేపుతున్న భూ కుంభకోణం

image

పల్నాడు జిల్లా గురజాలలో సుమారు 1330 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద ఆన్‌లైన్ చేయబడింది. ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ అక్రమాలకు 2019-24 వరకు గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ కోసం సెప్టెంబర్ 18న పొందుగల సచివాలయంలో ఎంక్వయిరీ సభ నిర్వహించనున్నారు.

Similar News

News September 13, 2025

కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు

image

కృష్ణ జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విద్యాసాగర్ నాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్ నాయుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేస్తున్నారు.

News September 13, 2025

GWL: నడిగడ్డ మావోయిస్ట్ పోతుల సుజాత లొంగుబాటు

image

గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన <>మోస్ట్ వాంటెడ్<<>> మావోయిస్ట్ పోతుల కల్పన @ సుజాత హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. చత్తీస్‌గఢ్ సౌత్ జోన్ బ్యూరో ఇన్‌ఛార్జ్ ఆమె కొనసాగారు. 104 కేసుల్లో నిందితురాలుగా ఉన్న సుజాతపై రూ.1 కోటి రివార్డు ఉంది. అనారోగ్యం కారణంగా ఆమె జనజీవన స్రవంతిలో కలిశారు. ప్రభుత్వం తరఫున ఆమెకు రూ. 25 లక్షలు అందజేశారు. ఈ విషయం నడిగడ్డలో హాట్ టాపిక్‌గా మారింది.

News September 13, 2025

భోగాపురం దాదాపు పూర్తయినట్లే: కేంద్ర మంత్రి రామ్మోహన్

image

AP: భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 86 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వర్షాలు కురుస్తున్నా GMR సంస్థ పనులు ఆపడం లేదన్నారు. విజయనగరంలో విమానాశ్రయ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ‘వచ్చే ఏప్రిల్‌లోగా వైజాగ్ నుంచి రోడ్డు కనెక్టివిటీ పనులు పూర్తి చేస్తాం. ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నాం. బీచ్ కారిడార్ కోసం ఇప్పటికే DPR సిద్ధం చేశాం’ అని వివరించారు.