News February 17, 2026

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

నాదెండ్ల – గణపవరం మధ్య నూతన హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో, వాహనదారుడు ఎగిరి కిందపడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హెల్మెట్ ధరించకపోవడమే మరణానికి ప్రధాన కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవన్నారు.

Similar News

News February 27, 2026

పార్వతీపురం: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 413 మంది గైర్హాజర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు DVEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్ధులు 840 మందికి 80 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,957 మందికి 333 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు.

News February 27, 2026

సీఎంలుగా చేసి ఇతర పార్టీల్లోకి జంప్!

image

ఒక పార్టీ నుంచి రాష్ట్రానికి CMగా వ్యవహరించినా రాజకీయ సమీకరణాలు, అవకాశాల కోసం పలువురు పార్టీ మారడానికి వెనకాడటం లేదు. తాజాగా TN మాజీ సీఎం <<19250954>>పన్నీర్ సెల్వం<<>> DMKలో చేరారు. INC నుంచి CMలుగా చేసిన అశోక్ చవాన్(మహారాష్ట్ర), కిరణ్‌కుమార్‌రెడ్డి(AP), అమరీందర్(పంజాబ్) BJPలో చేరారు. చంపై సోరెన్(ఝార్ఖండ్‌) JMM నుంచి BJPలోకి వెళ్లారు. జగదీశ్ షెట్టర్(కర్ణాటక) BJP నుంచి INCలోకి వెళ్లి మళ్లీ సొంతగూటికి చేరారు.

News February 27, 2026

HYD: మామూళ్ల మోజులో అధికారులు.. మెమోలు..!

image

​శివారు కాలనీల్లో నీటికోసం జనం తపిస్తుంటే అధికారులు మాత్రం ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపారు. కావాలనే పైపులైన్లలో ప్రెజర్ తగ్గించి ప్రైవేట్ ట్యాంకర్లకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ ఫిల్లింగ్ పాయింట్ల వద్దే తక్కువ ధరకు నీటిని నింపుకొని బయట రూ.2000 వరకు అమ్ముతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ దందాలో కిందిస్థాయి నుంచి పైదాకా వాటాలు వెళ్తున్నాయని తేలడంతో కొందరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి.