News February 13, 2025
పల్నాడులో లెదర్ పార్క్ ఏర్పాటు: ఎంపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739444002308_52098404-normal-WIFI.webp)
పల్నాడు జిల్లాలో లెదర్ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని ఎంపీ కృష్ణదేవరాయలు మంత్రి టీజీ భరత్‌ను కలిసి గురువారం విజ్ఞప్తి చేశారు. ఏపీఐఐసీ భవంతిలో ఎంపీ మాట్లాడుతూ.. లెదర్ పార్క్ స్థల పరిశీలన విషయాలను, ప్రాజెక్టుతో కలిగే లబ్ధిని, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాల గురించి వివరించారు. లెదర్ పార్కును ఏర్పాటు చేసేందుకు పల్నాడులో ఉన్న వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను విదేశీ ప్రతినిధి బృందానికి ఎంపీ తెలిపారు.
Similar News
News February 13, 2025
క్రమం తప్పకుండా విజిలెన్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739449582577_18976434-normal-WIFI.webp)
క్రమం తప్పకుండా విజిలెన్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలాల్లో మధ్యాహ్న భోజన నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టాలన్నారు.
News February 13, 2025
జగిత్యాల: బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739444267993_51569119-normal-WIFI.webp)
మార్చి 10 నుంచి నిర్వహించే ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ధర్మపురిలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని, ఎండకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
News February 13, 2025
వైసీపీటీఏ డైరీ ఆవిష్కరించిన వైఎస్ జగన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739452114575_52008866-normal-WIFI.webp)
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ వైఎస్సార్టీఏ అధ్యక్షులు అశోక్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్, గౌరవ అధ్యక్షులు జాలిరెడ్డితో పాటుగా 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీటీఏ డైరీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.