News May 15, 2024
పల్నాడులో హింసాత్మక ఘటనలపై టీడీపీ ప్రత్యేక కమిటీ

పల్నాడు జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఏడుగురితో ప్రత్యేక కమిటీని నియమించడం జరిగింది. కమిటీ సభ్యులుగా వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు.
Similar News
News September 12, 2025
నాగార్జున యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. సైన్స్, ఇంజినీరింగ్ కళాశాలల్లోని వివిధ ల్యాబ్‌లలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ కోర్సుల విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ నెల 16, 17 తేదీల్లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు.
News September 12, 2025
తెనాలి: ఆయేషా మీరా తల్లిదండ్రులకు CBI నోటీసులు

ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష ఆవేదన వ్యక్తం చేస్తూ నోటీసులను తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, బాధితులైన తమను ఎన్నిసార్లు కోర్టుకు తిప్పుతారని తల్లి శంషాద్ బేగం వాపోయారు.
News September 12, 2025
ANUలో ఏపీ పీజీ సెట్ విద్యార్థులకు ఇబ్బందులు

ఏపీ పీజీ సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఆలస్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసింది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులను గురువారం పెదకాకానిలోని నాగార్జున విశ్వవిద్యాలయానికి పిలిచినా, తీరా చివరి నిమిషంలో వాయిదా వేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు నిరాశ చెందగా, అధికారులు కేవలం పేర్లు, హాల్ టికెట్ వివరాలు మాత్రమే నమోదు చేశారు. ఈ నిర్లక్ష్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.