News February 27, 2025

పల్నాడులో 30 శాతం పోలింగ్ నమోదు

image

పల్నాడు జిల్లాలో గురువారం కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో మధ్యాహ్నం 12 గంటలకు 30 శాతం పోలింగ్ నమోదైంది. వారిలో పురుషులు 11,942 మంది, మహిళలు 5,387 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రాన్స్ జెండర్స్ ఎవరు ఓటింగ్‌కు రాలేదు. జిల్లాలో మొత్తంగా 30 శాతం ఓటింగ్ నమోదు కాగా 17,329 మంది పట్టభద్రులు తమ ఓట్లు వేశారు. కలెక్టర్ అరుణ బాబు పోలింగ్‌ను పరిశీలిస్తున్నారు. 

Similar News

News November 10, 2025

సింగపూర్‌ వెళ్లనున్న పాలకొండ టీచర్

image

రాష్ర్ట ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచి, అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటిస్తున్న పాలకొండ హైస్కూల్ సంస్కృత ఉపాధ్యాయుడు బి.శంకరరావును ప్రభుత్వం సింగపూర్ పంపిచనుంది. రాష్ర్టంలో మరికొందరు ఉపాధ్యాయులు, మంత్రి లోకేశ్‌తో పాటు అక్కడి ప్రముఖులతో పాఠశాలలో విద్యా విధానాన్ని అధ్యయనం చేయనున్నారు. ఈనెల 27న ప్రభుత్వం ఉపాధ్యాయులను సింగపూర్ పంపించనుంది. డిసెంబర్ వరకు ఉపాధ్యాయ బృందం ఢిల్లీలో పర్యటించనుంది.

News November 10, 2025

GWL: నూతన డీఎంహెచ్‌ఓగా సంధ్యా కిరణ్మయి

image

గద్వాల నూతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి (డీఎంహెచ్‌ఓ)గా డాక్టర్‌ జే.సంధ్య కిరణ్మయి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వైద్యశాఖ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సిద్ధప్పతో పాటు సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో హెల్త్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేద్దామని పేర్కొన్నారు.

News November 10, 2025

గద్వాల: ప్రజావాణికి 61 ఫిర్యాదుల వెల్లువ

image

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ సంతోష్‌ అధికారులకు సూచించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.