News December 22, 2025
పల్నాడు: అధిష్ఠానం నిర్ణయం.. అసంతృప్తి జ్వాలలు.?

పల్నాడు జిల్లా టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అధినాయకత్వం జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల పదవుల నియామకాలలో తీసుకున్న నిర్ణయంపై అధిక శాతం మంది పూర్తి వ్యతిరేకతతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానం వదులుకొని జిల్లాలో పార్టీని గెలిపించిన కొమ్మాలపాటి శ్రీధర్ నాయకత్వాన్ని ఎందుకు అధిష్ఠానం పరిగణలోకి తీసుకోలేదనే చర్చ నడుస్తోంది.
Similar News
News January 1, 2026
TODAY HEADLINES

✦ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న TG CM రేవంత్
✦ ఉద్యోగులకు రూ.713 కోట్లు విడుదల చేసిన TG సర్కార్
✦ గోదావరి నీటి మళ్లింపును అంగీకరించం: ఉత్తమ్
✦ APలో పెరుగుతున్న స్ర్కబ్ టైఫస్ కేసులు.. ఇప్పటివరకు 2 వేలకుపైగా నమోదు, 22మంది మృతి
✦ పెయిన్‌కిల్లర్ డ్రగ్ Nimesulide తయారీ, సేల్స్‌పై బ్యాన్: కేంద్రం
✦ కోమాలోకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్టిన్
News January 1, 2026
ట్రైనీ కానిస్టేబుళ్లకు రూ.12వేలు.. ఉత్తర్వులు జారీ

AP: ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12వేలకు పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న మంగళగిరిలో జరిగిన నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్టైఫండ్‌ను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం రెండు దశల్లో 9 నెలలపాటు జరగనుంది.
News January 1, 2026
శుభాకాంక్షలు తెలపండి కానీ.. అవి వద్దు: కలెక్టర్

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన జారీ చేశారు. అయితే జనవరి 1 సందర్భంగా తనను కలిసేందుకు వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని కలెక్టర్ సూచించారు. అయితే వసతి సంక్షేమ గృహాలలో చదువుకుంటున్న విద్యార్థుల సౌలభ్యం కోసం అవసరమైన పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యాసామాగ్రి తీసుకురావచ్చని కలెక్టర్ కోరారు.


