News February 5, 2026
పల్నాడు: అన్నదాతపై ఎరువుల భారం.. బస్తాకు రూ. 100 పెంపు!

పల్నాడు జిల్లా రైతులకు ఎరువుల ధరలు కన్నీరు తెప్పిస్తున్నాయి. రబీ సీజన్ ప్రారంభమయ్యాక రెండోసారి ధరలు పెరగడంతో సాగు ఖర్చు భారమైంది. ఒక్కో బస్తాపై రూ. 50 నుంచి రూ. 100 వరకు పెంచడంతో మొక్కజొన్న, మిర్చి, వరి సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఇబ్బందుల్లో ఉన్న తమను, ఈ అదనపు భారం మరింత కుంగదీస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 22, 2026
పాత గాజువాక జంక్షన్‌లో యాక్సిడెంట్

పాత గాజువాక జంక్షన్‌లో ఆదివారం ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వ్యక్తి తలపై నుంచి టిప్పర్ చక్రాలు వెళ్లిపోవడంతో తల నుజ్జునుజ్జయిపోయింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు, మృతుడు వివరాలు సేకరిస్తున్నారు.
News February 22, 2026
పాకిస్థాన్ అందుకే ఓడిపోతోంది: షోయబ్ అక్తర్

భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోతుండటానికి టీమ్ సెలక్షనే కారణం అని ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు. జట్టు ఎంపిక సరిగ్గా లేదని.. అసలు ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీమ్ సెలక్షన్ సరిగ్గా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల సమర్థత పాక్‌కు ఉందన్నారు. ICC టోర్నీల్లో పాక్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే. కాగా పాక్ <<19206100>>సెమీస్<<>> చేరాలంటే ENG, SLపై కచ్చితంగా గెలవాలి.
News February 22, 2026
అప్పుడు కూలదోసింది.. ఇప్పుడు కూడానా?

రాజీకి రాకపోతే ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి US సిద్ధంగా ఉంది. అయితే ఇది అమెరికాకు కొత్తేం కాదు. 1953లో అప్పటి పీఎం మొస్సాదేగ్ సర్కార్‌ను పడగొట్టింది. ఇరాన్ నేతలు, మిలిటరీ మద్దతు కూడగట్టి పత్రికల్లో మొస్సాదేగ్‌కు వ్యతిరేక కథనాలు ప్రచురించి అసమ్మతిని పెంచింది. ఆయిల్ కంట్రోల్ కోసం, USSR ప్రభావం పడకూడదని బ్రిటన్‌తో కలిసి ఆపరేషన్ ఎజాక్స్ చేపట్టింది. రెజా పహ్లావి రాచరికానికి మద్దతు ఇచ్చింది.


