News December 24, 2025
‘పల్నాడు ఉత్సవ్‌ను అధికారికంగా నిర్వహించాలి’

పల్నాడు చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తిస్తూ పల్నాడు ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం ఏప్రిల్ 4న 2022లో పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసింది. అమరావతి, విజయవాడ, ఆవకాయ్ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో పల్నాటి చరిత్ర భావితరాలకు తెలిసే విధంగా పల్నాటి ఉత్సవ్ ను అధికారికంగా నిర్వహించాలనేది జిల్లా ప్రజల కోరిక.
Similar News
News January 5, 2026
మేడారం: ప్రతి 50 అడుగులకు ఒక సీసీ కెమెరా..!

మేడారంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.ప్రధాన రహదారుల వెంట ప్రతి 50 అడుగులకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. 24గంటల పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.సీసీ కెమెరాల ఏర్పాటుతో మేడారంలో భద్రత మరింత మెరుగవుతుందని భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
News January 5, 2026
WGL: మంత్రి సీతక్కకు అరుదైన అవకాశం..!

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, చట్టంలో సవరణలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని చేపట్టింది. ఏఐసీసీ ఆధ్వర్యంలో ‘నరేగా బచావో సంగ్రామ్’ పేరుతో దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయనున్నారు. ఇందుకోసం తొమ్మిది మందితో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో తెలంగాణ నుంచి సీతక్కకు చోటు కల్పించారు.
News January 5, 2026
జూదంపై పోలీసుల ఉక్కుపాదం.. 19 మంది అరెస్ట్

కామారెడ్డి జిల్లాలో పేకాటపై పోలీసులు విరుచుకుపడ్డారు. మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోఘ గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 13 మందిని పట్టుకోగా, వారి వద్ద నుంచి 9 మొబైల్ ఫోన్లు, రూ.25,240 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గాంధారిలో నిర్వహించిన తనిఖీల్లో 6 మంది జూదరులు పట్టుబడ్డారు. వారి నుంచి 5 మొబైల్ ఫోన్లు, ₹8,490 నగదును సీజ్ చేశారు.


