News December 28, 2025
పల్నాడు: ఉరేసుకుని మైనర్ మృతి

రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో బాలుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చప్పిడి తేజ ఈనెల 13 నుండి కనిపించడం లేదు. అతని తల్లి మదులత 18న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతని తండ్రి శ్రీనివాసరావు కరెంటు పని చేస్తుంటాడు. వీరికి చెందిన స్టోర్ రూమ్‌లో
బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News December 29, 2025
శుభవార్త: దగదర్తి ఎయిర్ పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్

జిల్లా వాసుల చిరకాల కోరిక దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. విమానాశ్రయం భూసేకరణకు సంబంధించిన సమగ్ర నివేదికను కలెక్టర్ హిమాన్షు శుక్లా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. సోమవారం అమరావతిలో ఈ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. దీంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
News December 29, 2025
NLG: యూరియా పంపిణీలో పారదర్శకత ఉండాలి: కలెక్టర్

రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా నిరంతర నిఘా ఉంచాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సాగు పనుల దృష్ట్యా ఎరువుల పంపిణీ వద్ద వివాదాలు చోటుచేసుకోకుండా మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. పత్తి కొనుగోలు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
News December 29, 2025
NRPT: జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

నారాయణపేట జిల్లాలో యూరియా కొరత లేదని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరఫరా కొనసాగుతోందని ఇంచార్జ్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ప్రకటనలో చెప్పారు. జిల్లాలో రైతులకు ఇప్పటి వరకు 3000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, వివిధ పంపిణీ కేంద్రాల్లో 1009 మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్‌లో 2885 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. యూరియా సరఫరా సజావుగా జరుగుతున్నదని చెప్పారు.


