News February 20, 2025

పల్నాడు: ఎమ్మెల్సీ ఓటును చెక్ చేసుకోండి ఇలా..

image

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదైన వ్యక్తులు తమ ఓటు ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా <>https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html<<>> లింక్‌ను ఓపెన్ చేయాలి. రైట్ సైడ్‌లో MLC Registration 2024ను క్లిక్ చేస్తే 4 ఆప్షన్లు వస్తాయి. అందులో Search Your Name క్లిక్ చేసిన తర్వాత గ్రాడ్యుయేట్ కృష్ణా/గుంటూరు క్లిక్ చేసి Application ID/Name/ ఇంటి నంబర్ మూడింటిలో ఒకటి ఎంచుకుంటే పూర్తి వివరాలు వస్తాయి.

Similar News

News February 25, 2026

తిరిగి జట్టులో చేరనున్న రింకూ సింగ్!

image

T20 WC: తండ్రికి అనారోగ్యం నేపథ్యంలో చెన్నై క్యాంప్ నుంచి రింకూ సింగ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు జింబాబ్వేతో మ్యాచ్ నేపథ్యంలో ఇవాళ అతడు తిరిగి భారత జట్టులో చేరతారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. అయితే రింకూ తుది జట్టులో ఉంటారా, లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. WCలో ఇప్పటిదాకా అతడు ఆడిన 5 మ్యాచుల్లో 24 రన్స్ మాత్రమే చేయడం గమనార్హం.

News February 25, 2026

ఏకీకృత కుటుంబ సర్వేను పూర్తి చేయాలి: కలెక్టర్

image

యలమంచిలి మండలంలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం యలమంచిలి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో సాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పీ-4 కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

News February 25, 2026

విశాఖలో పర్యటించనున్న ఒడిశా గవర్నర్

image

ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఐఐఏఎమ్‌లో పుస్తకావిష్కరణ, ‘ప్రైడ్ ఆఫ్ నేషన్’ అవార్డుల ప్రదానం, బాలాజీ హైఫీల్డ్స్ స్కూల్ వార్షికోత్సవం, అమలాపురంలో జరిగే ‘వరల్డ్ తెలుగు కాన్‌క్లేవ్’ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మార్చి 5న తిరిగి భువనేశ్వర్ వెళ్తారు.