News October 13, 2025
పల్నాడు: ‘ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం’

పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ నరేంద్రనాథ్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 17వ తేదీలోపు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. 17వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో కౌన్సెలింగ్ జరుగుతుందని ఆయన వెల్లడించారు.
Similar News
News October 13, 2025
JGTL: మిషన్ భగీరథ నూతన EEగా జానకి బాధ్యతలు

జగిత్యాల జిల్లా మిషన్ భగీరథ నూతన ఈఈగా జానకి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం మిషన్ భగీరథ కార్యాలయంలో ఈఈగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమాను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ DE జలంధర రెడ్డి, AEలు రాజశేఖర్, దీపక్ పాల్గొన్నారు.
News October 13, 2025
రెండో టెస్టు.. భారత్ టార్గెట్ ఎంతంటే?

రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ 390 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ క్యాంప్‌బెల్(115), షై హోప్(103) సెంచరీలు చేశారు. చివరి వికెట్‌కు గ్రీవ్స్(50*), సీల్స్ (32) అద్భుతంగా పోరాడి 79 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో WI భారత్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా చెరో 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు.
News October 13, 2025
ఎకనామిక్ సైన్సెస్‌లో ముగ్గురికి నోబెల్

ఎకనామిక్ సైన్సెస్‌లో జోయెల్ మోకైర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోయిట్‌ను నోబెల్ ప్రైజ్ వరించింది. ఇన్నోవేషన్ ఆధారిత ఎకనామిక్ గ్రోత్‌ను వివరించినందుకు గాను వారికి ఈ పురస్కారం దక్కింది. ప్రైజ్‌లో మోకైర్‌కు అర్ధభాగం, అగియోన్, పీటర్‌కు సంయుక్తంగా మరో అర్ధభాగాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ఇప్పటికే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, <<17966688>>పీస్<<>>, లిటరేచర్ అవార్డులు ప్రకటించడం తెలిసిందే.