News October 11, 2025
పల్నాడు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు

పల్నాడు జిల్లా కలెక్టర్ ఫొటోను ఉపయోగించి ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి, ప్రజలను మోసగించి డబ్బులు వసూలు చేస్తున్నారని జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్ఓ) తెలిపారు. “మీ నంబర్ పంపండి-ఫర్నీచర్ ఉంది” “డబ్బులు పంపండి” అంటూ సందేశాలు పంపుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి నకిలీ ఫేస్‌బుక్ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు.
Similar News
News October 11, 2025
ఇదేందయ్యా ఇది.. 100కు 137 మార్కులా?

రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని MBM ఇంజినీరింగ్ వర్సిటీలో BE II సెమిస్టర్ విద్యార్థులకు ఊహించని పరిణామం ఎదురైంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 100 మార్కులకు ఏకంగా 103 నుంచి 137 రావడంతో అవాక్కయ్యారు. విషయం కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో మార్కులను వెబ్‌సైట్ నుంచి తొలగించారు. టెక్నికల్ తప్పిదం వల్ల ఇలా జరిగినట్లు ఎగ్జామ్ కంట్రోలర్ అనిల్ గుప్తా తెలిపారు. త్వరలోనే ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
News October 11, 2025
14న రాజమండ్రిలో జాబ్ మేళా

రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో మంగళవారం ప్రముఖ వాయుపుత్ర మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీఎంఎస్) కంపెనీలో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. 2020–2025 మధ్య డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని, జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News October 11, 2025
ఉస్మానియాలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం!

ఉస్మానియా ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బ్రాట్ డెడ్, అడ్మిట్ డెడ్ కేసులను మెడికల్ రికార్డు అధికారులు వెంటనే రికార్డు చేయకపోవడంతో సర్టిఫికెట్ పొందటానికి ఆలస్యం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కోసారి నెలల సమయం పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆస్పత్రి కడుతోన్న ప్రభుత్వం ఇటువంటి సమస్యలపై ఫోకస్ చేయాలని కోరుతున్నారు.