News November 16, 2025

పల్నాడు: కాక రేపుతున్న వారసత్వ రాజకీయాలు

image

పల్నాడు జిల్లాలో వారసత్వ రాజకీయాలు కాక రేపుతున్నాయి. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు తమ వారసులను రాజకీయ బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే తమ వారసులను ప్రజలలోకి పంపి రాజకీయ ఒడిదుడుకులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 16, 2025

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన ఇషా

image

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్‌ కాంస్యంతో మెరిసింది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్‌ పిస్టల్‌ విభాగంలో ఇషా 30 పాయింట్లు సాధించి 3వస్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్లో 587 పాయింట్లు సాధించి అయిదో స్థానంతో ఫైనల్‌కు వచ్చిన ఇషా తుదిపోరులో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇషాకు ఇదే తొలివ్యక్తిగత పతకం. ఈ ఏడాది ప్రపంచకప్‌ స్టేజ్‌ టోర్నీలో ఆమె స్వర్ణం, రజతం సాధించింది.

News November 16, 2025

శంషాబాద్: విమానంలో స్మోకింగ్ చేసిన ప్రయాణికుడు

image

విమానంలో పొగ తాగిన ప్రయాణికుడిని ఎయిర్ లైన్స్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాలు.. రియాద్ నుంచి ఇండిగో విమానంలో శనివారం ఓ ప్రయాణికుడు శంషాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగినట్లు ఎయిర్‌లైన్స్ సిబ్బంది గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 16, 2025

పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలు?

image

TG: పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే చట్టపరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పార్టీపరంగానే వెళ్లే అవకాశం ఉంది. దీనిపై రేపు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.