News September 4, 2024

పల్నాడు: కొండవీడు నగరవనం మూసివేత

image

జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండవీడు ఘాట్ రోడ్డులో కొండచరియలు రోడ్డుపై విరిగిపడిన విషయం తెలిసిందే. మళ్లీ వర్షాలు పడి కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న కారణంగా ఈనెల 6 వరకు కొండవీడు నగరవనం మూసివేస్తున్నట్ల జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Similar News

News July 7, 2025

పేరెంట్స్-టీచర్ మీటింగ్‌కు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 10న పేరెంట్స్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం విద్యాసంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపే ప్రక్రియను సోమవారం మధ్యాహ్నానికే పూర్తి చేయాలని సూచించారు.

News July 7, 2025

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి: DEO

image

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2025 సంవత్సరానికి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మండల, ఉప విద్యాశాఖ అధికారి ద్వారా ఈనెల 13వ తేదీలోగా http//nation-alawardstoteachers.education.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 7, 2025

ANMల బదిలీలలో చిక్కుముడులు.. మరోసారి కౌన్సెలింగ్

image

గుంటూరు జిల్లా వైద్య శాఖ ఇటీవల ANM గ్రేడ్-3గా ఉన్న సుమారు 200 మందికి పదోన్నతులు మంజూరు చేసి కొత్త నియామకాలు ఇచ్చింది. కానీ గత కౌన్సెలింగ్‌లో అదే పోస్టులు ఖాళీలుగా చూపటంతో పలువురు ఎంపిక చేసుకున్నారు. ఈ అంశం అధికారులు గుర్తించడంతో గత కౌన్సెలింగ్‌ను రద్దు చేసి సోమవారం మళ్లీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మీ తెలిపారు. ఈసారి ప్రక్రియ సునిశ్చితంగా, సీనియారిటీ ప్రాతిపదికన సాగనుంది.