News December 31, 2025
పల్నాడు: కొమ్మాలపాటి పయనం ఎటు.?

పల్నాడు TDP అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్‌కు ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. జిల్లా అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారని అనుకున్న తమ్ముళ్లకు పార్టీ అధిష్ఠానం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. గతంలో పెదకూరపాడు టికెట్ ఆశించిన శ్రీధర్‌ను పక్కన పెట్టి అధిష్ఠానం భాష్యం ప్రవీణ్‌కు కట్టబెట్టగా.. శ్రీధర్‌కు అధ్యక్షుడి పదవి ఇచ్చారు. ప్రస్తుతం అది కూడా పోవడంతో శ్రీధర్ పయనం ఏంటనే చర్చ మొదలైంది.
Similar News
News January 1, 2026
ఇల్లందు: 51 శాతం బొగ్గు ఉత్పత్తి: GM కృష్ణయ్య

డిసెంబర్-2025 నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 5.30 లక్షల టన్నులకు గాను 2.71 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 51 శాతం ఉత్పత్తి చేసినట్లు జియం వి.కృష్ణయ్య తెలిపారు. గురువారం డిసెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. 1.56 లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా, ఆర్.సి.హెచ్.పి ద్వారా 1.13, ఇల్లందు ఏరియాలో మొత్తం 2.26 లక్షల టన్నుల బొగ్గు బట్వాడా చేశామన్నారు.
News January 1, 2026
గుంతకల్లులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుంతకల్లులోని పారిశ్రామిక వాడ సమీపంలో గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బైక్‌పై వెళ్తున్న అతను ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 1, 2026
డ్రంకెన్ డ్రైవ్.. రీడింగ్ చూస్తే షాకే!

TG: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబు రీడింగ్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. నిన్న రాత్రి వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తికి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేయగా ఏకంగా 438 రీడింగ్ నమోదైంది. న్యూఇయర్ వేళ డ్రంకెన్ డ్రైవ్‌లో నమోదైన రీడింగ్‌ల్లో ఇదే అత్యధికమని ఏఎస్పీ శుభం ప్రకాశ్ తెలిపారు. కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.


