News February 22, 2025

పల్నాడు: కోటి ఒక్క ప్రభ వస్తే స్వామి కిందకు వస్తాడు

image

గొల్లభామ పాతకోటయ్య స్వామికి ప్రతిరోజు పూజలు చేస్తుంది. తాను వయోభారంతో కొండ ఎక్కలేకపోతున్నా అని స్వామిని వేడుకోగా.. స్వామి ప్రత్యక్షమై నీవు వెనకకు చూడకుండా కిందకు నడువు, నీ వెనక నేను వస్తానని చెప్పాడు. గొల్లభామ కిందకు దిగుతూ స్వామి వెనక వస్తున్నారో లేదో అని విని తిరిగి చూడటంతో స్వామి శిలగా మారారు. దీంతో ఆమె స్వామిని వేడుకోగా.. కోటికి ప్రభలు వస్తే కోటప్పకొండ దిగి వస్తానని వరం ఇచ్చాడు.

Similar News

News July 6, 2025

రెండ్రోజుల్లో శ్రీశైలం గేట్లు ఓపెన్!

image

AP: శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 1.88 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 878 అడుగుల నీరు ఉంది. దీంతో 8, 9 తేదీల్లో గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది.

News July 6, 2025

జాతీయ స్థాయి హాకీ పోటీలకు ధర్మవరం క్రీడాకారుల ఎంపిక

image

జార్ఖండ్ రాజధాని రాంచిలో జరుగుతున్న 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ పోటీలలో రాష్ట్ర జట్టుకు ధర్మవరానికి చెందిన మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా జనరల్ సెక్రటరీ బి.సూర్యప్రకాష్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు జరిగే హాకీ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున మధురిమా భాయ్, వైష్ణవి, వర్ష పాల్గొంటారన్నారు. కేరళ రాష్ట్ర జట్టుకు తలారి హేమ ఎంపికయ్యారని పేర్కొన్నారు. క్రీడాకారులను అభినందించారు.

News July 6, 2025

ఎన్టీఆర్: బీపీఈడీ, డీపీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. జులై 15, 16, 17, 18 తేదీలలో ఉదయం 10 గంటలకు విజయవాడలోని వీకేఆర్ డిగ్రీ కాలేజీలో ఈ పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాల కోసం https://kru.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని KRU అధికారులు సూచించారు.