News October 22, 2025

పల్నాడు: ఖరీఫ్ అనుభవాలతో రబీ పంటకు ప్రణాళికలు

image

ఖరీఫ్ పంటలో చోటు చేసుకున్న అనుభవాలతో రబీ పంటకు ఇబ్బందు లేకుండా పల్నాడు జిల్లాలో వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పల్నాడు జిల్లాలో పంటల విస్తీర్ణాన్ని గుర్తించి ఏ పంటను ఎంత విస్తీర్ణంలో వేస్తారో అంచనా వేస్తుంది. ఖరీఫ్‌లో జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో యూరియా కొరత నెలకొన్న నేపథ్యంలో రబీ పంటకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 22, 2025

కల్వకుర్తి: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

కల్వకుర్తి నియోజకవర్గంలోని గౌరిపల్లి గ్రామానికి చెందిన పసుపుల మల్లేశ్ (27) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కుటుంబంలో నెలకొన్న కలహాల కారణంగా ఐదు రోజుల క్రితం పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 22, 2025

నకిలీ మద్యం కేసు: 7 రోజుల పోలీస్ కస్టడీ!

image

AP: నకిలీ మద్యం కేసు నిందితులను 7 రోజుల పోలీస్ కస్టడీకి VJA కోర్టు అనుమతి ఇచ్చింది. విజయవాడ జైలులో ఉన్న A2 జగన్ మోహన్‌రావును రేపు, నెల్లూరు జైలులో ఉన్న A1 జనార్దన్‌రావును ఎల్లుండి కస్టడీలోకి తీసుకోనున్నారు. A13 తిరుమలశెట్టి శ్రీనివాస్‌నూ కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ దాఖలు చేయగా విచారణ రేపటికి వాయిదా పడింది. అటు జనార్దన్‌రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.

News October 22, 2025

పథకాలు, కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించండి: కలెక్టర్

image

వ్యవసాయ, అనుబంధ రంగాలలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేసి, నూతన సాంకేతికతను తెలియజేయాలన్నారు. శిక్షణా కార్యక్రమాలకు ఆత్మ పీడీ నోడల్ అధికారిగా ఉండాలన్నారు.