News April 26, 2024

పల్నాడు: జిల్లాలో ఏడో రోజు 89 నామినేషన్లు 

image

జిల్లాలో ఏడవ రోజు గురువారం మొత్తం 89 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. నరసరావుపేట పార్లమెంట్‌కు 11, నరసరావుపేట అసెంబ్లీకి 14, పెదకూరపాడు అసెంబ్లీకి 10, చిలకలూరిపేట అసెంబ్లీకి11 సత్తెనపల్లి అసెంబ్లీకి 9, వినుకొండ అసెంబ్లీకి 12, గురజాల అసెంబ్లీకి 13, మాచర్ల అసెంబ్లీకి 9 నామినేషన్లు దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు. 

Similar News

News February 18, 2026

పోక్సో కేసులో అసెంబ్లీ ASO మునిరాజా అరెస్ట్

image

AP అసెంబ్లీ ఉద్యోగి ASO మునిరాజా తండ్రిలా దరిచేరి బాలికపై అత్యాచారయత్నం చేశాడు. లైంగిక దాడి, కుల దూషణ కేసులో అరెస్ట్ చేసినట్లు నున్న పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన భర్త లేని ఓ తల్లి, ఆమె కూతురిని 2 ఏళ్లుగా ఆర్థికంగా, మానసికంగా మునిరాజా వేధించడం, బాలిక దుస్తుల మార్చుకునే దృశ్యాలు చిత్రీకరించినట్లు విచారణలో తేలింది. ఈయన వెలగపూడిలోని AP అసెంబ్లీలో పనిచేస్తూ తాడేపల్లిలో నివాసం ఉంటున్నాడు.

News February 18, 2026

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

image

గుంటూరు జిల్లాలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం విద్యార్థులకు భోజనం పెడతారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తాయి. టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తారు. జూన్ 12న బడులు పునఃప్రారంభం అవుతాయి.

News February 18, 2026

పీఎఫ్ జమల్లో ఆలస్యం.. ఉపాధ్యాయుల ఆందోళన

image

గుంటూరు జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల పీఎఫ్ బకాయిల జమ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. 2022లో జీతాల నుంచి కత్తిరించిన మొత్తాలు ఇంకా ఖాతాలకు చేరకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా నివేదికలలో స్పష్టత లేకపోవడం వల్ల జాప్యం జరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బదిలీల కారణంగా వివరాలు సేకరించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే డీఏ బకాయిలు కూడా పూర్తిగా జమ కాలేదని వారు అంటున్నారు