News April 7, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ జిల్లాలో భారీగా ఈదురు గాలులు☞ వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు☞ చిలకలూరిపేటలో గ్రీవెన్స్ నిర్వహించిన కలెక్టర్ ☞ నరసరావుపేటలో బాలికల వసతి గృహం తనిఖీ ☞ పెదకూరపాడులో ఉచిత మెడికల్ క్యాంపులు ☞ ఎడ్లపాడు ఎస్ఐగా శివరామకృష్ణ బాధ్యతలు
Similar News
News October 16, 2025
ADB: సపోర్ట్ ఇంజినీర్ పోస్టుకు దరఖాస్తులు

సపోర్ట్ ఇంజినీర్ పోస్టును అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అర్హతలు బీటెక్/ఎంసీఏ, టెక్నికల్ సపోర్ట్‌లో నాలుగేళ్ల అనుభవం ఉండాలన్నారు. నెలకు రూ.35,000 చెల్లిస్తామని తెలిపారు. అగ్రిగేట్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. 2025 జులై 1 నాటికి కనీస వయస్సు 18, గరిష్టంగా 46 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుందన్నారు.
News October 16, 2025
ట్రాఫిక్‌లోనే జీవితం అయిపోతోంది!

ఒకప్పుడు ఆశలు, అవకాశాలకు కేంద్రంగా ఉన్న ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ బెంగళూరు ఇప్పుడు కళ తప్పుతోంది. భారీ ట్రాఫిక్ జామ్స్, మౌలిక సదుపాయాలు క్షీణించడం, ఖర్చులు పెరగడం నగర జీవితాన్ని దుర్భరం చేశాయి. ఇక్కడి ప్రజల జీవితంలో ఏడాదికి సగటున 134 గంటలు ట్రాఫిక్‌లోనే గడిచిపోతోంది. దీంతో చాలామంది వివిధ నగరాలకు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటు HYDలోనూ పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ పెరిగిపోయింది.
News October 16, 2025
కాకినాడ ప్రత్యేకాధికారిగా కలెక్టర్

కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ బదిలీ కావడంతో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆ సంస్థకు ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాకినాడ స్మార్ట్ సిటీకి కూడా ఆయనే చైర్మన్ కావడంతో, కలెక్టర్ అధికారాలు పెరిగాయి. కలెక్టర్ షాన్ మోహన్ కాకినాడ నగర పాలనపై పట్టు బిగించారు.