News April 13, 2025

పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ నరసరావుపేట: అభ్యంతరకర పోస్టులతో వివాహిత మృతి ☞ చిలకలూరిపేట: పీఏసీ సభ్యురాలుగా మాజీమంత్రి విడుదల రజిని.. సత్తెనపల్లి: లారీ కిందపడి వ్యవసాయ కూలి మృతి☞ ఎడ్లపాడు: లింగారావుపాలెం గ్రామంలో నాటిక పోటీలు ☞ నాదెండ్ల: అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వామి దగ్ధం ☞ నూజెండ్ల: మండలంలో వడగండ్ల వాన☞ పిడుగురాళ్ల: బ్రాహ్మణపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం

Similar News

News April 15, 2025

డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

image

తూ.గో.జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు డ్రోన్‌లతో ప్రత్యేక నిఘాను పటిష్ఠం చేసినట్లు ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం, పేకాట, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

News April 15, 2025

హార్వర్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన ట్రంప్

image

తమ నిబంధనలను వ్యతిరేకించిన హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ 2.2 బి.డాలర్ల గ్రాంట్లు, 60 మి. డాలర్ల కాంట్రాక్టులను నిలిపివేసింది. యాంటీ సెమిటిజం (యూదు వ్యతిరేకత)పై యూనివర్సిటీ డిమాండ్లను తిరస్కరించడం, విద్యార్థి సంఘాలను నిషేధించడం, అడ్మిషన్ పాలసీలను మార్చడం వంటి షరతులకు అంగీకరించకపోవడం దీనికి కారణం. హార్వర్డ్ తమ స్వాతంత్ర్యం, రాజ్యాంగ హక్కులను కాపాడుకుంటామంటోంది.

News April 15, 2025

NGKL: సళేశ్వరం జాతరకు 3 లక్షలకు పైగా భక్తులు..!

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న సళేశ్వరం ఉత్సవాలకు మూడు రోజుల్లో దాదాపు 3 లక్షలకు పైగానే భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. ఈనెల 11 నుంచి 13 వరకు సళేశ్వరం ఉత్సవాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లింగామయ్యను దర్శించుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతం భక్తుల తాకిడికి దద్దరిల్లిపోయింది. వరుసగా రెండు రోజులు ట్రాఫిక్ జామ్ అయింది.

error: Content is protected !!