News March 16, 2025

పల్నాడు జిల్లాలో నిలకడగా చికెన్ ధరలు 

image

పల్నాడు జిల్లాలో చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. లైవ్ కోడి కేజీ రూ.95, స్కిన్‌లెస్ రూ.200లు , స్కిన్‌తో రూ.180లుగా ఉంది. నాటుకోడి రూ.500ల నుంచి రూ.750ల వరకు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలలో మార్పులేదు. మటన్ ధర కేజీ రూ.1,000లుగా ఉంది. 100 కోడిగుడ్లు రూ.460-480 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో చికెన్‌కు ఆదివారం డిమాండ్ కొనసాగుతోంది. 

Similar News

News March 16, 2025

ప్రకాశం: 10వ తరగతి ఎగ్జాం సెంటర్లలో సీసీ కెమెరాలు

image

ప్రకాశం జిల్లాలో సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 9 లైవ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఆరు సమస్యాత్మకమైన కేంద్రాలను గుర్తించామన్నారు. ఆయా కేంద్రాల్లో ఎలాంటి కాపీయింగ్‌కు పాల్పడకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఎగ్జాం సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

News March 16, 2025

సూర్యాపేట: జిల్లాలో చికెన్ ధరలు ఇలా

image

సూర్యాపేట జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్‌ స్కిన్) కేజీ రూ.170-180 ఉండగా..స్కిన్‌లెస్ కేజీ రూ.200 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.110-120 మధ్య ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. 

News March 16, 2025

మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 4,141 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

error: Content is protected !!