News March 24, 2024
పల్నాడు జిల్లాలో రూ.1 కోటి సామగ్రి సీజ్

కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి పకడ్బందీగా పర్యవేక్షణ జరుగుతుందని శనివారం జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. కోడ్ ఉల్లంఘన సహితమైన 11225 (పబ్లిక్), 3938 ప్రయివేటు అంశాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రూ.17.94 లక్షల నగదు, రూ.23.31 లక్షలు విలువైన లిక్కర్, ఇతర సామగ్రి 52.65 లక్షలు, మొత్తం రూ.1.1 కోట్ల వరకు సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News April 14, 2025
ఏప్రిల్ 16న గుంటూరులో మిర్చి రైతుల నిరసన

పేరేచర్లలో మిర్చి సాగు చేసిన కౌలు రైతులు దిగుబడి తక్కువగా రావడంతో అధిక నష్టాలు భరిస్తున్నారు. మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. మద్దతు ధర ప్రకటించినా, కొనుగోలు ప్రక్రియ లేదు. రైతులు బోనస్ ఇవ్వాలని, రూ.15,000కి క్వింటాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 16న గుంటూరులో నిరసన నిర్వహించనున్నారు.
News April 14, 2025
చర్లపల్లి వరకే సికింద్రాబాద్-రేపల్లె ఎక్స్‌ప్రెస్

పునరాభివృద్ధి పనుల నేపథ్యంలో సికింద్రాబాద్–రేపల్లె(17645) ఎక్స్‌ప్రెస్ రైలు టెర్మినల్‌ను ఏప్రిల్ 15 నుంచి సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి మార్చనున్నారు. రైలు బయల్దేరే సమయం కూడా మధ్యాహ్నం 1.30 కాకుండా గంటకు ముందుగా 12.30కి మార్చినట్టు అధికారులు వెల్లడించారు. అయితే మార్గమధ్య స్టేషన్లు, వాటి సమయాల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. ఈ రైలు సిరిపురం, వేజెండ్ల, తెనాలి, చినరావూరు, గుంటూరులలో ఆగుతుంది.
News April 14, 2025
గుంటూరు: టిడ్కో గృహాల్లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

నల్లపాడు టిడ్కో గృహాల్లో 17 ఏళ్ల షేక్ నగ్మా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫలితాల్లో ఆమెకు 780 మార్కులు వచ్చాయి. అయితే ఆమె మైగ్రేన్ బాధతో ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. ఆ రోజు తల్లిదండ్రులు చిన్న కుమార్తెతో కలిసి బయటికి వెళ్లిన వేళ, ఏమైందో తెలీదు కానీ ఇంట్లో ఒంటరిగా ఉన్న నగ్మా ఉరివేసుకుంది. ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు ఆమె మృతదేహంలా కనిపించింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.