News August 3, 2024
పల్నాడు జిల్లాలో వేట కొడవళ్ల కలకలం
గురజాల మండలం దైద గ్రామంలో వేట కొడవళ్లు కలకలం రేపాయి. స్థానికుల కథనం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి ఫ్లెక్సీలో వేట కొడవళ్లు తీసుకెళ్తున్న సమయంలో గ్రామస్థులకు కనబడటంతో కొడవళ్లు గడ్డివాములో విసిరేసి పరారయ్యాడన్నారు. ఎవర, ఎక్కడికి తీసుకెళ్తున్నారనే సమాచారం తెలియాల్సి ఉంది. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 29, 2024
ఈనెల 30న మంగళగిరిలో జాబ్ మేళా
ఈనెల 30న మంగళగిరిలోని VJ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. ఈ జాబ్‌మేళాకు 9 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10 నుంచి పీజీ, డిప్లొమా, బీటెక్, ఐఐటీ, ఇంటర్ అభ్యర్థులు అర్హులని చెప్పారు. 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన వారికి సూమారు రూ.20వేల జీతం ఉంటుందన్నారు.
News November 29, 2024
చేబ్రోలు: బాలికను హత్య చేసిన నిందితుడు అరెస్ట్
చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న శైలజ(13)ను జులై 15వ తేదీన నాగరాజు అనే వ్యక్తి హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు గత నాలుగు నెలలుగా నాగరాజు కోసం గాలింపు చేపట్టారు. ఈమేరకు గురువారం నిందితుడిని రాజమండ్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News November 29, 2024
నేటి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు
నేటి నుంచి రానున్న 4 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా తెలిపారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.