News March 26, 2025
పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలపై సీఎం సమీక్ష

పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్ పి. అరుణ్ బాబుతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు రక్షణ, ప్రశాంత వాతావరణం అందించామని వారు సీఎంకు తెలిపారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి శక్తి యాప్ వంటి వాటిపై ఎస్పీ నుంచి సీఎం సమాచారం తీసుకున్నారు.
Similar News
News December 28, 2025
పల్నాడు: ఉరేసుకుని మైనర్ మృతి

రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో బాలుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చప్పిడి తేజ ఈనెల 13 నుండి కనిపించడం లేదు. అతని తల్లి మదులత 18న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతని తండ్రి శ్రీనివాసరావు కరెంటు పని చేస్తుంటాడు. వీరికి చెందిన స్టోర్ రూమ్‌లో
బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
News December 28, 2025
ఇల్లు ఏ ఆకారంలో ఉండటం ఉత్తమం?

ఇల్లు చతురస్రం లేదా దీర్ఘ చతురస్ర ఆకారాల్లో ఉండటం ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఈ ఆకారాలు ఇంట్లో శక్తిని సమతుల్యం చేస్తాయి. క్రమపద్ధతి లేకుండా మూలలు పెరగడం, తగ్గడం వంటి ఎగుడుదిగుడులు ఉండనివ్వవు. వంకరలు, అస్తవ్యస్తమైన ఆకృతులు ఉన్న ఇల్లు వాస్తు దోషాలకు దారితీసి అశాంతిని కలిగిస్తుంది. సరైన కొలతలతో కూడిన క్రమబద్ధమైన ఆకృతే యజమానికి శ్రేయస్సు చేకూరుస్తుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 28, 2025
NTR: బాలుడి ప్రాణం తీసిన దోమల చక్రం

కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో దోమల చక్రం వల్ల ఏర్పడిన అగ్ని ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకొచ్చింది. రాణిగారితోట తారకరామనగర్‌కు చెందిన అనిల్‌కుమార్ తన కుమారుడు సమర్పణపాల్ (9)తో కలిసి నిద్రపోతున్నాడు. అంతకు ముందే వెలిగించిన దోమల చక్రం నిప్పు ప్రమాదవశాత్తు దుప్పటికి అంటుకుని మంటలు వ్యాపించాయి. ఘటనలో గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.


