News January 3, 2026

పల్నాడు జిల్లాలో 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

పల్నాడు జిల్లాలో 100 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో (KGVB) 62, టైప్-4 కేజీబీవీల్లో 38 నాన్ టీచింగ్ పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

Similar News

News February 9, 2026

364 అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల వారు ఫిబ్రవరి 28 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in

News February 9, 2026

రేపు స్పీకర్‌పై అవిశ్వాస అస్త్రం!

image

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండీ కూటమి సిద్ధమైంది. సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష MPలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నరవణె పుస్తక ప్రస్తావన సమయంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం, ప్రధానిపై దాడికి ప్రయత్నిస్తున్నారంటూ మహిళా MPలపై నిరాధార ఆరోపణలు చేయడం ఈ వివాదానికి ఆజ్యం పోశాయి.

News February 9, 2026

నెల్లూరు: CIపై ఆరోపణలు.. కానిస్టేబుల్ సస్పెండ్

image

తనను ఉదయగిరి సీఐ N.వెంకట్రావు <<19088594>>వేధిస్తున్నారని <<>>సీతారామపురం మహిళా కానిస్టేబుల్ జ్యోతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమెకు నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆమెను సస్పెండ్ చేశారు. ‘ఉన్నతాధికారి పర్మిషన్ లేకుండా ప్రెస్‌మీట్ నిర్వహించడం రూల్స్‌కు విరుద్ధం. సీఐపై నిరాధార ఆరోపణలు చేశారు. క్రమశిక్షణ చర్యల కింద ఆమెను సస్పెండ్ చేశాం’ అని SP పేర్కొన్నారు.