News December 14, 2025

పల్నాడు జిల్లాలో 22 మంది ఎస్ఐల బదిలీలు

image

పల్నాడు జిల్లాలో ఎస్పీ కృష్ణారావు ఆదివారం ఎస్ఐల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 22 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ, వారికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీ అయిన ఎస్ఐలు వెంటనే కొత్త స్టేషన్లలో విధుల్లో చేరాలని ఎస్పీ కృష్ణారావు ఆదేశించారు.

Similar News

News December 18, 2025

రేపు ఒంగోలులో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

image

ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్ ఆవరణంలో 19న శుక్రవారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డీఈవో రేణుక తెలిపారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులను వైజ్ఞానిక పరంగా ప్రోత్సహించేందుకు ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రదర్శన అనంతరం సాయంత్రం బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందని తెలిపారు.

News December 18, 2025

ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. రేపు కేంద్రమంత్రులతో భేటీ

image

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అమిత్ షా, నిర్మల, గడ్కరీ, సీఆర్ పాటిల్, హర్దీప్ సింగ్, సర్బానందలతో భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించి వినతి పత్రాలు అందజేస్తారు. రాత్రికి తిరిగి APకి చేరుకునే అవకాశం ఉంది. ఎల్లుండి అనకాపల్లిలో పర్యటించి మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

News December 18, 2025

23న కడపలో రాయలసీమ AMCల ఛైర్మన్ల సమావేశం

image

ఈనెల 23న కడపలో రాయలసీమ జిల్లాల వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ల సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా AMC ఛైర్మన్లను నియమించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాయలసీమ పరిధిలోని 72 వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కడప రీజనల్ డైరెక్టర్ రామాంజనేయులు గురువారం తెలిపారు.